టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కొచ్చి సిటీలో లాంచ్ చేసింది. ఇందులోని బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు వెళ్లొచ్చు. మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లు. స్మార్ట్ ఎక్స్‌హోం చార్జింగ్, బ్లూటూత్, లైవ్ చార్జింగ్ స్టేటస్, ఆర్‌ఎఫ్‌ఐడీ సెక్యూరిటీ వంటి ఫీచర్లు ఉంటాయి. ధర రూ.1.24 లక్షలు.
