ఎంబసీ బిల్డింగ్‌నే అమ్మేసిండు

ఎంబసీ బిల్డింగ్‌నే అమ్మేసిండు

ఇస్లామాబాద్: ఆయన పాకిస్థాన్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ సయ్యద్ ముస్తఫా అన్వర్. ఇండోనేసియాలో పాక్ అంబాసిడర్ గా కూడా పనిచేశారు. అయితే.. పాక్ సర్కారు వద్దని అనుమతి నిరాకరించినా, ఆయన ఏకంగా జకార్తాలోని పాక్ ఎంబసీ బిల్డింగ్ను చాలా అగ్గువకే అమ్మేశాడట. ఆగస్టు 19న ఆయనపై ఈ మేరకు అకౌంటబిలిటీ కోర్టులో విచారణ జరిగింది. అన్వర్ 2001-–2002లో ఇండోనేసియాలో పాక్ అంబాసిడర్ గా పనిచేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎంబసీ బిల్డింగ్ అమ్మకం ప్రాసెస్షురూ చేశారట. ఆ తర్వాత పాక్ విదేశాంగ శాఖ అనుమతికోసం లేఖ రాశారట. ఈ ప్రపోజల్ ను విదేశాంగశాఖ తిరస్కరిస్తూ లేఖలు రాసినా, బిల్డింగ్ను ఆయన కారుచౌకగా అమ్మేశారట. విచారణ సందర్భంగా పాకిస్థాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) ఈ విషయాలను వివరించింది. నేషనల్ అకౌంటబిలిటీ ఆర్డినె న్స్ లోని సెక్షన్ 9(ఏ)6 ప్రకారం అన్వర్ అధికారాన్ని మిస్ యూజ్ చేశారని ఆరోపించింది. అన్వర్ కారణంగా పాకిస్తాన్ సర్కార్ ఖజానాకు 13లక్షల డాలర్ల(రూ. 9.81 కోట్లు) నష్టం
వాటిల్లినట్లు ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ తెలిపింది.