దిష్టి బొమ్మలు గా మారిన ముద్దుగుమ్మలు

దిష్టి బొమ్మలు గా మారిన ముద్దుగుమ్మలు

ఇంటికి దిష్టి తగలకుండా గతంలో దిష్టిబొమ్మలు పెట్టేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. దిష్టి … పంటపొలాలకు  తగలకుండా ఉండేందుకు మోడల్స్  ఫ్లెక్సీలను తెచ్చిపెట్టేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామంలో రైతులు దిష్టి బొమ్మల బదులుగా మోడల్ ఫ్లెక్సీలు పంట  పొలంలో పెట్టుకుంటున్నారు. పక్షుల బెడద, నర దిష్టి నుండి కాపాడడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని  రైతులు భావిస్తున్నారు.

కాగా గతంలో సంగారెడ్డికి చెందిన ఓ రైతు దిష్టి తగలడం వల్లే పంటనష్ట పోతున్నట్లు భావించి కాజల్ బొమ్మను ఫ్లెక్సీలుగా చేయించి దిష్టిబొమ్మగా పెట్టాడు. కాజల్ బొమ్మను పెట్టడంతో దిష్టిపోయి పంటలో లాభాల్ని చవి చూసినట్లు చెప్పాడు.