
గజ్వేల్, వెలుగు: అనారోగ్యానికి గురైన కొడుకు కోలుకోవటంలేదన్న బెంగతో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడు. హైద్రాబాద్ ఎర్రగడ్డకు చెందిన గొర్రె నర్సింలు కొంత కాలంగా తన భార్య రేణుక ఊరైన నాచారంలో ఉంటున్నాడు. వీరి పెద్ద కొడుకు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా నయం కావడంలేదని నర్సింలు ఎప్పుడూ బాధ పడుతుండేవాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన నర్సింలు తిరిగిరాలేదు. ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. సోమవారం సాయంత్రం నాచారంలోని వెంకటాయి చెరువులో నర్సింలు మృతదేహం తేలింది. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
For More News..