
అన్ని కంపెనీల సేల్స్ అదుర్స్
న్యూఢిల్లీ: ఇండియా ఆటోమొబైల్ సెక్టార్‌కు పండుగ సీజన్ బాగా కలిసి వచ్చింది. పల్లెటూళ్ల నుంచి కూడా గిరాకీ బాగానే వచ్చింది. ఆఫర్లు, డిస్కౌంట్ల కారణంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. పోయిన నెలలో ఒకటిరెండు మినహా అన్ని కంపెనీలు టోకు అమ్మకాల్లో రెండంకెల గ్రోత్‌ను సాధించాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్స్ బాగా అమ్ముడయ్యాయి. టూవీలర్లకూ గిరాకీ బాగా కనిపించింది. మనదేశంలోని టాప్ కంపెనీలు మారుతి, హ్యుండై, టాటా, మహీంద్రా సేల్స్పోయిన నెలలో కనీసం 15 శాతం పెరిగాయి. మహీంద్రా అమ్మకాలు ఏకంగా 60 శాతం పెరిగాయి. మారుతి అమ్మకాలు 21 శాతం, టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం పెరిగాయి.
21 శాతం పెరిగిన మారుతీ సుజుకీ అమ్మకాలు
మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 21 శాతం పెరిగి 1,67,520 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో మొత్తం 1,38,335 యూనిట్లను అమ్మింది. మొత్తం డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు అక్టోబర్‌లో 1,47,072 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది నెలలో 1,17,013 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 21,831 యూనిట్ల నుండి 24,936 యూనిట్లకు పెరిగాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్ వ్యాగన్ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు గత నెలలో 48,690 యూనిట్ల నుంచి ఈ ఏడాది అక్టోబరులో 73,685 యూనిట్లకు పెరిగాయి. బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్ ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు 27,081 యూనిట్ల నుంచి 30,971 యూనిట్లకు పెరిగాయి. ఈకో అమ్మకాలు 10,320 యూనిట్ల నుండి 8,861 యూనిట్లకు తగ్గాయి. ఎల్సీవీ, కమర్షియల్, సూపర్‌క్యారీ అమ్మకాలు 3,797 యూనిట్ల నుండి 2,913 యూనిట్లకు తగ్గాయి. ఎగుమతులు 21,322 యూనిట్ల నుంచి 20,448 యూనిట్లకు తగ్గాయి.
హ్యుందాయ్ మోటార్స్
ఈ కంపెనీ అమ్మకాలు 2021 అక్టోబరుతో పోలిస్తే ఈసారి అక్టోబరులో 33 శాతం పెరిగి 58,006 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 43,556 యూనిట్లను డీలర్లకు పంపించింది. డొమెస్టిక్ అమ్మకాలు 37,021 యూనిట్ల నుంచి 30 శాతం పెరిగి 48,001 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 53 శాతం పెరిగి 6,535 యూనిట్ల నుంచి10,005 యూనిట్లకు చేరుకున్నాయి. హ్యుందాయ్ మోటార్స్ ఎస్యూవీ లైనప్‌లో - వెన్యూ, క్రెటా, అల్కజార్, టక్సన్, కోనా ఎలక్ట్రిక్ ఉన్నాయి. ఎన్-లైన్ సిరీస్ ఐ20 వెన్యూ మోడల్‌ను కూడా అమ్ముతోంది. సెమీ కండక్టర్ల కొరత తీరిపోవడంతో కస్టమర్ల డిమాండ్‌ను తీర్చగలిగామని, గడువులోపు కార్లను డెలివరీ చేయగలిగామని కంపెనీ తెలిపింది.
టాటా మోటార్స్
ఈ సంస్థ అమ్మకాలు 15.49 శాతం పెరిగి 78,335 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 67,829 యూనిట్లను విక్రయించింది. డొమెస్టిక్ అమ్మకాలు 17 శాతం వృద్ధితో 65,151 యూనిట్ల నుంచి 76,537 యూనిట్లకు ఎగిశాయి. డొమెస్టిక్ మార్కెట్లో ఈవీలు సహా ప్యాసింజర్ వెహికల్ (పీవీ) అమ్మకాలు 33 శాతం వృద్ధితో 34,155 యూనిట్ల నుంచి 45,423 యూనిట్లకు దూసుకెళ్లాయి. పీవీల ఎగుమతులు 10 శాతం తగ్గి 206 యూనిట్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ వ్యాపారంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్అమ్మకాలు 4,277 యూనిట్లు ఉన్నాయి. గత అక్టోబరులో 1,660 యూనిట్లు డీలర్లకు వెళ్లాయి. డొమెస్టిక్ మార్కెట్లో కమర్షియల్ వెహికల్ అమ్మకాలు 31,226 యూనిట్ల నుంచి 31,320 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు 2,448 యూనిట్ల నుండి 1,592 యూనిట్లకు పడిపోయాయి.
ఇతర కంపెనీల అమ్మకాలు
హోండా కార్స్ ఇండియా డొమెస్టిక్ హోల్‌సేల్స్‌లో 18 శాతం పెరిగి 9,543 యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో 1,747 యూనిట్లు ఎగుమతి కాగా, 2021 అక్టోబరు నెలలో 1,678 యూనిట్లను ఎగుమతి చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 60 శాతం పెరిగి పోయిననెలో 32,298 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 20,130 యూనిట్లను విక్రయించింది. యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు 32,226 యూనిట్లు కాగా, కమర్షియల్ సెగ్మెంట్లో 20,980 యూనిట్లను అమ్మింది. ట్రాక్టర్ అమ్మకాలు గత నెలలో 11 శాతం పెరిగి 51,994 యూనిట్లకు చేరుకున్నాయి.
కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అశోక్ లేలాండ్ అమ్మకాలు 34 శాతం పెరిగి 14,863 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 11,079 యూనిట్లను విక్రయించింది. డొమెస్టిక్సేల్స్ 13,860 యూనిట్లుగా ఉన్నాయి.
బజాజ్ ఆటో గత అక్టోబరులో 4,39,615 టూవీలర్లను అమ్మగా, ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు 10శాతం తగ్గి 3,95,238 యూనిట్లకు చేరుకున్నాయి.