దిగ్గజ ప్లేయర్లకు ఇదే చివరి ఫిఫా వరల్డ్ కప్

దిగ్గజ ప్లేయర్లకు ఇదే చివరి ఫిఫా వరల్డ్ కప్

ఫిఫా వరల్డ్ కప్ 2022కు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది.  ఆదివారం  రాత్రి 9.30 గంటలకు ఖతార్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ మొదలవుతుంది.  మొత్తం 29 రోజుల పాటు జరిగే సాకర్ సమరంలో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా  ఈ టోర్నీకి 32 జట్లు అర్హత సాధించాయి. ఈ జట్లను 8 గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా  నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు అంటే 14 రోజుల పాటు..48 గ్రూప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక్కడ ప్రతి గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచిన రెండు జట్లు రౌండ్-16కి అర్హత సాధిస్తాయి. డిసెంబరు 3 నుంచి  నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత నంతరం క్వార్టర్‌ఫైనల్‌, సెమీ ఫైనల్ మ్యాచులు నిర్వహిస్తారు. డిసెంబర్ 18న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. 

ఏ గ్రూపుల్లో ఏ ఏ జట్లు..
గ్రూప్ Aలో ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్ జట్లు ఉండగా..గ్రూప్ Bలో ఇంగ్లండ్, ఇరాన్, USA, వేల్స్ కంట్రీస్ స్థానం దక్కించుకున్నాయి. అటు గ్రూప్ Cలో  అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్, గ్రూప్ డిలో  ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా..గ్రూప్ Eలో  స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ F లో బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా టీమ్స్, గ్రూప్-Gలో  బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్ జట్లు,..గ్రూప్-హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా తలపడనున్నాయి. 

సిద్ధమైన స్టేడియాలు..
ఫిఫా వరల్డ్‌ కప్ లో భాగంగా జరిగే 64 మ్యాచులకు  8 స్టేడియాలు సిద్ధమయ్యాయి. అల్‌ బయత్‌ స్టేడియం, లుసెయిల్‌ స్టేడియం, స్టేడియం 974, అల్‌ తుమామా స్టేడియం, అహ్మద్‌ బిన్‌ అలీ స్టేడియం, ఎడ్యుకేషన్‌ సిటీ స్టేడియం,ఖలీఫా ఇంటర్నేషనల్‌ స్టేడియం,అల్‌ జనాబ్‌ స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి.  ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ ప్రభుత్వం..ఈ స్టేడియాలను సుందరంగా నిర్మించింది. 

వీరికిదే చివరి వరల్డ్ కప్...
ఫిఫా వరల్డ్ కప్ 2022 కొందరు ఫుట్‌బాల్ ప్లేయర్లకు చివరి కానుంది. పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకి ఇదే ఆఖరి ప్రపంచకప్. రొనాల్డో నాలుగు వరల్డ్ కప్ లలో పాల్గొన్నాడు. 17 మ్యాచుల్లో 7 గోల్స్ సాధించాడు. అయితే ఒక్కసారి కూడా దేశానికి వరల్డ్ కప్ అందించలేకపోయాడు. లియోనెల్ మెస్సీకి కూడా ఇదే  లాస్ట్ వరల్డ్ కప్. ఐదోసారి వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ  ఇప్పటి వరకు 19 మ్యాచుల్లో ఆరు గోల్స్ చేశాడు.  వీరితో పాటు.. పోలాండ్ ప్లేయర్ రాబర్ట్ లెవాండోవ్స్కీ‌, ఉరుగ్వే హైయెస్ట్ గోల్ స్కోరర్ లూయిస్ సురేజ్‌, బ్రెజిల్ అటాకింగ్ ప్లేయర్ డానీ అలివ్స్‌,  ఫ్రాన్స్ ప్లేయర్ కరీం బెంజెమా.. క్రోకటియా ప్లేయర్ లూకా మార్డిక్.. జర్మనీ గోల్ కీపర్ మాన్యూల్ నెవర్, జర్మనీ ప్లేయర్ థామస్ ముల్లర్ 2022 ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతారు.