
ప్రతిభాపాటిల్ తర్వాత రెండో మహిళా ప్రెసిడెంట్
స్వాతంత్య్రం వచ్చాక పుట్టి, ప్రెసిడెంట్ అవుతున్న తొలి వ్యక్తి
ప్రెసిడెంట్లు అయిన వారందరిలో చిన్న వయస్కురాలు
ఎవరికి ఎన్ని ఓట్లంటే..
రాష్ట్రపతి ఎన్నికల తుది ఫలితాలు గురువారం రాత్రి వెల్లడయ్యాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,809 మంది ఉండగా.. 4,754 మంది ఓటు వేశారు. 53 చెల్లని ఓట్లున్నాయి. వ్యాలీడ్ ఓట్లు 4,701 కాగా.. ద్రౌపది ముర్ముకు 2,824 మొదటి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి. వాటి విలువ 6,76,803. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 3,80,177. రాష్ట్రపతి ఎన్నికకు కావాల్సిన ‘కోటా’ 5,28,491. ఈ లెక్కన 28% ఎక్కువ ఓట్లు ముర్ముకు పడ్డాయి. తొలి ప్రాధాన్యత కింద ముర్ముకు వచ్చిన ఓట్లు కోటా కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆమెను విజేతగా ప్రకటించారు.