‘దసరా’ ఫైనల్ షెడ్యూల్‌‌ బిగిన్స్

‘దసరా’ ఫైనల్ షెడ్యూల్‌‌ బిగిన్స్

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న చిత్రం ‘దసరా’. ఊర మాస్ క్యారెక్టర్​లో నటిస్తున్నాడు నాని. కీర్తి సురేష్ హీరోయిన్‌‌. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన నాని ఫస్ట్ లుక్‌కు, ధూమ్ ధామ్ సాంగ్‌‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బొగ్గుగని సెట్‌‌లో నిన్నటి నుంచి కొత్త షెడ్యూల్‌‌ను ప్రారంభించారు. పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌‌లో కీలకమైన క్లైమాక్స్ సీన్‌‌ను షూట్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 

ఈ విషయాన్ని  ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసిన నాని.. లొకేషన్ స్టిల్‌‌ని షేర్ చేశాడు. ‘చివరి షెడ్యూల్‌‌లో మొదటి  రోజు. మైండ్, బాడీ, హార్ట్, రేజ్‌‌లతో ఫుల్ పొటెన్షియల్’ అంటూ స్టేటస్ పెట్టాడు. ఈ షెడ్యూల్ తర్వాత, ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు మేకర్స్.  ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.