
ఒక హీరోయిన్ ఓ సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం కొత్త విషయమేమీ కాదు. చాలామంది అలా చేస్తారు. అయితే చేసే ప్రతి మూవీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టే అయితే అది కచ్చితంగా విశేషమే. అందుకే ఆలియా భట్‌ని తిరుగులేని హీరోయిన్ అంటున్నారంతా. ఈ యేడు ఆల్రెడీ ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రంతో వచ్చి సూపర్ హిట్ కొట్టింది ఆలియా. త్వరలో ‘ఆర్‌ఆర్ఆర్’ మూవీతో రాబోతోంది. తర్వాత ‘బ్రహ్మాస్త్ర’లోనూ కనిపించబోతోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ ట్రయాలజీలోని మొదటి పార్ట్ ‘శివ’ సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. నిన్న ఆలియా పుట్టినరోజు కావడంతో ఓ చిన్న గ్లింప్స్ ద్వారా ఆమె పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇషా మిశ్రా అనే మోడర్న్ అమ్మాయి పాత్ర తనది. సూపర్ హీరోని ప్రేమించే సూపర్‌గాళ్‌గా కనిపించనుంది. అమితాబ్, నాగార్జున, డింపుల్ కపాడియా లాంటి ఫేమస్ స్టార్స్ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక దీనితో పాటు రణ్‌వీర్ సింగ్‌తో ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’లో నటిస్తోంది ఆలియా. ‘డార్లింగ్స్’ సినిమాలో లీడ్ రోల్ చేయడంతో పాటు తనే నిర్మిస్తోంది కూడా. ఈ రెండూ ఈ సంవత్సరమే విడుదలయ్యే చాన్స్ ఉంది. మరోవైపు హాలీవుడ్‌లో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ మూవీ కూడా చేస్తోంది.