ఇవాటి నుంచే అల్టిమేట్‌‌‌‌‌‌‌‌‌‌ ఖో ఖో లీగ్‌‌‌‌

ఇవాటి నుంచే అల్టిమేట్‌‌‌‌‌‌‌‌‌‌ ఖో ఖో లీగ్‌‌‌‌

ముంబై: గ్రామీణ క్రీడ  ఖో ఖో  లీగ్‌‌‌‌ రూపంలో  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అల్టిమేట్ ఖో ఖో తొలి సీజన్‌‌‌‌ ఆదివారం మొదలుకానుంది. ఈ టోర్నీలో తెలుగు యోధాస్ , చెన్నై క్విక్ గన్స్ , గుజరాత్ జెయింట్స్ , ముంబై ఖిలాడీస్  ఒడిషా జాగర్నాట్స్ , రాజస్థాన్ వారియర్స్ అనే ఆరు జట్లు బరిలో నిలిచాయి. పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌లో ముంబై ఖిలాడీస్‌‌‌‌, గుజరాత్‌‌‌‌ జెయింట్స్‌‌‌‌ పోటీ పడతాయి. రెండో పోరులో చెన్నైతో తెలుగు యోధాస్‌‌‌‌ అమీతుమీ తేల్చుకుంటుంది.

లీగ్‌‌‌‌ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌‌‌‌ల్లో తలపడుతుంది. టాప్‌‌‌‌4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌‌‌‌లు సోనీ నెట్ వర్క్‌‌‌‌లో తెలుగు సహా ఐదు భాషల్లో ప్రసారం అవుతాయి.