
గద్వాల/హాలియా, వెలుగు: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో పది గేట్లను ఎత్తి నీటిని నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 66,450 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 29,920, బీమా లిఫ్ట్ 1కు 1300, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, కోయిల్ సాగర్‌కు 315, లెఫ్ట్ కెనాల్‌కు 770, రైట్ కెనాల్‌కు 460, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, బీమా లిఫ్ట్ 2కు 750, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,00,609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఎగువ నుంచి వస్తున్న నీటితో సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి 1,16,833 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో సాగర్ నీటి మట్టం 541.20 అడుగులకు చేరుకుంది. సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ ద్వారా 3,202 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.