
హైదరాబాద్, వెలుగు: కొత్తగా కడుతున్న తెలంగాణ సెక్రటేరియట్‌లో నల్ల పోచమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నరేందర్ రావు దంపతులు భూమి పూజ చేశారు. ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డితో పాటు పలువురు సెక్రటేరియట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మసీదులు నిర్మాణం జరుగుతోంది. సెక్రటేరియట్‌తో పాటే గుడి, మసీదులను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.