మొదటి సెషన్ లో ఒక్క వికెట్ కూడా తీయని బౌలర్లు

మొదటి సెషన్ లో ఒక్క వికెట్ కూడా తీయని బౌలర్లు

బంగ్లాదేశ్, భారత్ మధ్య మొదటి టెస్ట్ నాలుగవ రోజు ఆట కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగులు చేసి భారత్ డిక్లేర్ ఇచ్చింది. అయితే, 512 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లా దూకుడుగా ఆడుతోంది. ఏ దశలోనూ భారత బౌలర్లకు అవకాశం ఇవ్వట్లేదు. మొదటి సెషన్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. 

ఓపెనర్లు నజ్ముల్ షాంటో (67, 156 బంతుల్లో), జాకిర్ హసన్ (66,153 బంతుల్లో) చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ, అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఉప ఖండం పిచ్ లు నాలుగు, ఐదు రోజులు స్పిన్ కి అనుకూలించినా మన స్పిన్నర్లు వికెట్ తీయడానికి తంటాలు పడుతున్నారు. 

అయితే, రెండవ సెషన్ ప్రారంభం అయ్యేసరికి కొంత ఊరట లభించింది. రెండో సెషన్ తొలి ఓవర్ వేసిన ఉమేష్ .. భారత్ కి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ యాసిర్ అలీని (5, 12 బంతుల్లో) అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. అయితే, ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే బంగ్లాను ఆలౌట్ చేయాలి. ప్రస్తుతం క్రీజ్ లో బంగ్లా బ్యాట్స్ మెన్ లిట్టన్ దాస్ (3,33 బాల్స్ లో), జాకిర్ హసన్ (66, 159) ఉన్నారు.