ట్విట్టర్, మెటా ఉద్యోగులు జాగ్వార్ లోకి

ట్విట్టర్, మెటా ఉద్యోగులు జాగ్వార్ లోకి

ట్విట్టర్, మెటా కంపెనీలు భారీగా ఉద్యోగాల కోత విధించిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ కంపెనీళ్లో కొన్నెండ్లుగా పనిచేసినవాళ్లు ఏ  కంపెనీల్లో చేరాలనే అయోమయంలో పడిపోయారు. అలాంటివాళ్లందరికీ టాటా కంపెనీ తీపి కబురు ఇచ్చింది. టాటా కొనుగోలు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ కంపెనీలోకి ట్వి్ట్టర్, మెటా కంపెనీలు వదిలిన ఉద్యోగుల్లోంచి 800 మంది తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

ఈ డ్రైవ్ ద్వారా జాగ్వార్ లాండ్ రోవర్ కంపెనీలోని డిజిటల్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయబడతాయి. భారత్, యూకే, ఐర్లాండ్, చైనా, యూఎస్ఎ, హంగేరీ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, ఎలక్ట్రిఫికేషన్, మెషిన్ లెర్నింగ్ డిపార్ట్ మెంట్స్ లోకి ఉద్యోగుల్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం వల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుందని, ఫైనాన్షియల్ గ్రోత్ రేట్ మెరుగుపడుతుందని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తున్నారు.