డబ్బు.. సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది

డబ్బు.. సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది

టాలీవుడ్ కింగ్ ‘నాగార్జున’ తాజాగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చూడవచ్చు. 'డబ్బు.. సక్సెస్.. సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' అని హీరో చెప్పే డైలాగ్ ఆసక్తిని రేపుతోంది. 

తన అక్క, ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో చేసే సాహసమే ఈ సినిమా. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.