
న్యూఢిల్లీ : దేశాన్ని నేర రహితంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కుల, మత, వర్గాలకు అతీతంగా నేరస్తులను శిక్షిస్తున్నామన్నారు. మహిళలపై అఘాయిత్యాలను సహించేది లేదన్నారు. బాధితులకు త్వరగా న్యాయం అందేలా చూస్తామన్నారు. ఢిల్లీలో ఈ-సైబర్ ల్యాబ్ ఓపెనింగ్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అలాగే.. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ల 21వ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించారు.