ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతుకు రూ.6లక్షల పరిహారం

ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతుకు రూ.6లక్షల పరిహారం

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 133 మంది రైతులకు  7కోట్ల 95లక్షలు రిలీజ్ చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 6 లక్షల చొప్పున పరిహారం అందించనుంది సర్కార్. ఏడేళ్లుగా రైతు ఆత్మహత్యలపై స్పందించని సర్కార్.. ఇటీవల వరుసగా రైతు ఆత్మహత్యలతో విమర్శలు రావడంతో.. కొందరికి పరిహారం ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో అత్యధికంగా.. వికారాబాద్ జిల్లాలో 27మందికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23మంది రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇక అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్క రైతు కుటుంబానికి పరిహారం అందనుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రోజుకు సగటున ముగ్గురు చొప్పున చనిపోతున్నారని రైతు సంఘాలు చెప్తున్నాయి. ఏడేళ్లుగా ఏడువేల మందికి పైగా రైతులు చనిపోగా... ప్రస్తుతం 133మంది రైతులకు పరిహారం ఇస్తోంది సర్కార్.