
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2023–24 కి గాను బడ్జెట్ తయారీని ప్రభుత్వం నేటి నుంచి మొదలు పెట్టనుంది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఢల్‌గా ఉండడంతో దేశ ఎకానమీ గ్రోత్‌కు సపోర్ట్ ఇచ్చేలా ఈసారి బడ్జెట్ ఉంటుందని ఎనలిస్టుల అంచనావేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ మొదట వివిధ మినిస్ట్రీలతో పాటు సంబంధిత డిపార్ట్‌మెంట్లతో చర్చలు జరపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన ఖర్చుల వివరాలను, వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం అవసరమయ్యే ఫండ్స్ గురించి చర్చించనున్నారు.
మొదటి రోజు (సోమవారం) సవరించిన అంచనాలపై ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లయిమేట్ చేంజ్ మినిస్ట్రీతో,లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీతో, ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీతో, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీతో, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీతో ఫైనాన్స్ మినిస్ట్రీ చర్చలు జరపనుంది. ఈ చర్చలు ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాలపైన, వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం అవసరమయ్యే ఫండ్స్‌పైన జరుగుతాయి. ఈ మీటింగ్స్‌కు ఫైనాన్స్ సెక్రెటరీ, ఎక్స్‌పెండిచర్ సెక్రెటరీలు నాయకత్వం వహిస్తారు. ఇలాంటి టైప్ మీటింగ్‌లు నెల పాటు అంటే వచ్చే నెల 10 వరకు
జరుగుతాయి.