పంట బాగా పండాలని పండుగ చేసుకుంటరు

V6 Velugu Posted on Sep 03, 2021

నేలతల్లిని కన్నతల్లిలా చూస్తారు ఆదివాసులు. అందుకే పొలం పనులు మొదలుపెట్టే ముందు నేలతల్లికి పూజలు చేసి, పండుగ చేసుకుంటారు. అరుణాచల్​ప్రదేశ్​లోని ఆదిమ ట్రైబ్స్ చేసుకునే ‘సోలంగ్​ ఫెస్టివల్​​’  కూడా అలాంటిదే. ప్రతి యేడాది సెప్టెంబర్​ మొదటి వారం ‘సోలంగ్​ ఫెస్టివల్​’తో ఊరు ఊరంతా పండుగ కళ కొట్టొచ్చినట్టు  కనిపిస్తుంది. విత్తనాలు చల్లి, పంట బాగా రావాలని నేలమ్మకి మొక్కుతారు. వాళ్లు పవిత్రంగా భావించే మిథున్​ (ఆవు), పందుల పెంపకం లాభదాయకంగా ఉండాలని, ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం కావొద్దని  ఆది దేవతలైన ‘కైన్​–ననె’, ‘దది బొటె’ని ప్రార్థిస్తారు. దుష్టశక్తుల నుంచి రక్షించాలని, పెంపుడు జంతువుల్ని కాపాడాలని వేడుకుంటారు. ఈ ఐదు రోజులు సాయంత్రం పూట మహిళలు ట్రెడిషనల్​ దుస్తులు వేసుకుని పాటలు పాడతారు. ఆ పాటల్లో వ్యవసాయం ఎలా మొదలైంది, జంతువులు, మొక్కలు, మనిషి పుట్టుక గురించి చెబుతూ, హుషారుగా డాన్సులు చేస్తారు.  మాంసం వంటకాలు, రైస్​ బీర్​ ఇచ్చిపుచ్చుకుంటారు. చిన్నపిల్లలు కూడా ట్రెడిషనల్​గా రెడీ అయి డాన్సులు చేస్తారు. మగవాళ్లు ‘టగ్​ ఆఫ్​ వార్​’లో పోటీ పడతారు.  

ఐదు రోజుల పండుగ
‘సోలంగ్​ ఫెస్టివల్​’ అనేది పొలాల పండుగ. ఈ పండుగని ఐదు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ ఫెస్టివల్​లో ముఖ్యమైన రెండో రోజున జంతువుల్ని బలి ఇస్తారు. మూడో రోజున దేవతలకి పూజలు చేస్తారు. నాలుగో రోజున విల్లు, బాణాలు, ఇతర ఆయుధాలు తయారు చేస్తారు. ఐదో రోజున మత పెద్ద లేదా పూజారి పూజ చేశాక మహిళలు పాటలు పాడుతూ ‘పొనుంగ్​’ నృత్యాలు చేస్తారు.

Tagged life style, crop, Festival, grows, , worshiped

Latest Videos

Subscribe Now

More News