Sunday Recipes : కొబ్బరి రొయ్యలు, ఫిష్ ఫిలెట్స్ ఈజీగా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి..

Sunday Recipes : కొబ్బరి రొయ్యలు, ఫిష్ ఫిలెట్స్ ఈజీగా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి..

హేయ్... సండే వచ్చేసింది..! మరి స్పెషల్ ఏంటి?' ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించేవే. ముఖ్యంగా మాంసాహార ప్రియులకైతే... ఆదివారం వచ్చిందంటే అది పండగే. నాన్​ వెజ్​లో ఏం ఏం వెరైటీలు చేసుకోవాలా అని ఆలోచిస్తారు. అన్నం కూరల సంగతి పక్కన పెడితే... ఈవెనింగ్ స్నాక్స్ లోనూ నాన్​ వెజ్​ కోరుకుంటారు చాలామంది. అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ స్నాక్స్- మరి ఇంకెందుకాలస్యం...  సండే ఈవెనింగ్​  స్నాక్స్కు కు  సిద్ధమైపోండి.

ఫిష్ ఫిలెట్స్ తయారీకి  కావల్సినవి

  • చేప ముక్కలు (ముళ్లు తీసినవి)-రెండు కప్పులు
  • మైదా లేదా శనగపిండి-1కప్పు 
  • బియ్యం పిండి- 1 కప్పు
  • నూనె-పరిపడా
  • ఉప్పు-తగినంత
  • కారం - 1 టీ స్పూన్
  • బేకింగ్ సోడా-చిటికెడు 
  • ఎండిన బ్రెడ్ పొడి- రెండు కప్పులు

తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో మైదా శెనగపిండి, బియ్యం పిండిని తీసుకోవాలి (కావాలంటే కొద్దిగా మొక్కజొన్న పిండి కూడా కలపొచ్చు) ఇప్పుడు అందులో ఉప్పు, కారం, బేకింగ్ సోడా వేయాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి, జారుడుగా చేయాలి. చేప ముక్కలను ఆ పిండెలో ముంచాలి. మళ్లీ వాటిని  బ్రెడ్​ పొడిలో దొర్లించి నూనెలో డీప్​ ఫ్రై చేయాలి. వీటిని ఎవరికి వచ్చినట్లుగా వాళ్లు సర్వ్ చేసుకోవచ్చు. 

కొబ్బరి రొయ్యలు తయారీకి కావల్సినవి

  • పచ్చి రొయ్యలు- 1 కప్పు
  • గుడ్డు సొన - టేబుల్ స్పూన్
  • ఎండు కొబ్బరి తురుము-1 కప్పు
  •  మసాలా పొడి- టీస్పూన్
  • మిరియాల పొడి- చిటికెడు 
  • ఉప్పు- తగినంత
  •  కారం-తగినంత
  • నూనె - సరిపడా (వీలైతే కొబ్బరి నూనె వాడాలి)
  • ఎండిన బ్రెడ్ పొడి- అరకప్పు( కావాలనుకుంటేనే)

తయారీ విధానం : ఒక గిన్నెలో గుడ్డు సొనను  తీసుకోవాలి.అందులో అర కప్పు కొబ్బరి తురుము, మసాలా పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసి కలపాలి. ఆపైన రొయ్యలను గుడ్డు మిశ్రమంలో ముంచాలి. తర్వాత మళ్లీ మిగిలిన ఎండు కొబ్బరి, బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో డీప్​ ఫ్రై చేయాలి. వీటిని ఏదైనా సాస్​తో సర్వ్​ చేసుకోవచ్చు..

►ALSO READ | Women Beauty : ఎక్కువగా ఫేషియల్ చేయించుకుంటున్న వాళ్లు ఈ విషయం తెలుసుకోండి..!

–వెలుగు,లైఫ్​–