Women Beauty : ఎక్కువగా ఫేషియల్ చేయించుకుంటున్న వాళ్లు ఈ విషయం తెలుసుకోండి..!

Women Beauty : ఎక్కువగా ఫేషియల్ చేయించుకుంటున్న వాళ్లు ఈ విషయం తెలుసుకోండి..!

అందంగా కనిపించాలని  అందరికీ ఉంటుంది. రోజురోజుకూ మార్కెట్లో కొత్తకొత్త బ్యూటీ ప్రాడెక్ట్స్ వస్తున్నాయి. కాలేజీ యువతులే కాదు సాధారణ గృహిణులు కూడా వేడుకలప్పుడు, పండుగలప్పుడు మేకప్ చేయించుకుంటున్నారు. చిన్నచిన్న నగరాల్లో కూడా బ్యూటీపార్లర్లు వచ్చేశాయి. కొందరైతే ముఖం కాంతిమంతంగా కనిపించాలని సొంతంగా ఫేషియల్ చేసుకుంటున్నారు. అయితే తరచు ఫేషియల్ చేయించుకోవటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు స్కిన్ స్పెషలిస్టులు. పేషియల్ కు వాడే కొన్నిరకాల లోషన్స్, క్రీమ్స్ లో ఉండే రసాయనాల్లో గాఢత ఎక్కు వగా ఉంటుంది. అందువల్ల అవి చర్మంపై తీవ్రప్రభావం చూపుతాయి. డెర్మిస్ దెబ్బతిని రాషెస్ రావచ్చు. 

►ALSO READ | Weekend Special : రోజువారీ సూపర్ ఫుడ్స్ ఇవే.. రెగ్యులర్ గా ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..!

గిట్టకపోతే దద్దుర్లు, దురదలు వస్తాయి.అన్ని రకాల రసాయనాలు అందరికీ పడకపోవచ్చు. బ్లాక్ హెడ్ ల వల్ల మచ్చలు ఏర్పడొచ్చు. రోజూ ఫేషియల్ చేయించుకోవటం వల్ల చర్మంలో ఉండే తేమశాతం తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారిపో యే ప్రమాదం ఉంది. కాబట్టి వాడే లోషన్స్, క్రీమ్స్ లో రసాయనాల శాతం ఎంత? అవి చర్మానికి పడతాయా? లేదా? తెలుసుకుని ఫేషియల్ చేసుకోవాలి.

–వెలుగు,లైఫ్​–