మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తున్నాయా. ..అంటే సందేహమే..! మంచి ఆహారమే తీసుకుంటున్నామని భావిస్తున్నప్పటికీ, ఏదో ఒక పోషకాహార లోపం ఉండే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ పోషకాల్ని అందిస్తూ... ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్నే తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాల్ని 'సూపర్ ఫుడ్స్" అంటారు. మనకు అందుబాటులో ఉండే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బాదం-పిస్తా: పోషకాలు అధికంగా ఉన్న నట్స్ లో బాదం, పిస్తాలు ఉత్తమమైనవి. వీటిలో ప్రొటీన్లతోపాటు పీచు శాతం అధికంగా ఉంటుంది. పిస్తాలో కొవ్వు చాలా స్వల్పం బాదం, పిస్తా -లలో క్యాల్షియం, పొటాషియమ్ మెగ్నిషియమ్, విటమిన్- ఇ, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి . ప్రతి రోజు తప్పనిసరిగా ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ని తప్పనిసరిగా తినాలి.
గ్రీన్ టీ: ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇటీవలి కాలంలో గ్రీన్ టీ వినియోగం పెరిగిపోయింది. కేన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు రాకుండా నియంత్రించగలిగే శక్తి గ్రీన్ టీకి ఉంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లే ఇందుకు కారణం. ముఖ్యంగా ఎపిగ్యాల్లోకేట్ న్ గ్యాలెట్ అనే ఫైటోకెమికల్ ఎంతో మేలు చేస్తుంది. రోజూ మూన్నా లుగు సారైనా గ్రీన్ టీ తాగితే మంచిది
ఆకు కూరలు: గోంగూర, తోటకూర, మునగాకు పుదీనా, కరివేపాకు సహా ఆకు కూరలన్నీ ఎంతో మంచివి. తక్కువ క్యాలరీలు ఉండే వీటిలో క్యాల్షియం, విటమిన్ ఎ.సి.కె. రైబోప్లేవిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, యాంటీ అక్సిడెంట్లు వంటి పోషకాలు అధిక శాతంలో ఉంటాయి.
ఓట్స్ : ఫైబర్ యాంటీ అక్సిడెంట్లు సహా ఇతర పోషకాలు ఓటి లో అధికంగా ఉంటాయి. ఓటేమీ ట్ గా పిలిచే వీటిని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. ఐరన్, జింక్, పాస్ఫరస్, కాపర్, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి-1. విటమిన్ బి-5 వంటి పోషకాలు ఓట్స్ నుంచి లభిస్తాయి. వీటిని పాలలో లేదా నీటిలోనూ ఉడకబెట్టి తినొచ్చు. కొవ్వు శాతం తక్కువగా ఉండే ఇవి త్వరగా జీర్ణమవుతాయి:
కోడిగుడ్డు : మన శరీరానికి అవసరమైన 13 రకాల విటమిన్లు, మినరల్స్ లభించే ఆహారం కోడి గుడ్డు . ఒక గుడ్డులో సగటున 30 క్యాలరీల శక్తి, ఆరు గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ తో సహా ఇతర పోషకాలన్నీ కోడి గుడ్డు నుంచి లభిస్తాయి. రోజూ రెండు గుడ్లను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
అల్లం: కాస్త ఘాటుగా ఉండే అల్లం ఎన్నో ఆరోగ్యప్రయోజనాల్ని కలిగి ఉంది. జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి వాటి నుంచి అల్లం ఉపశమనం కలిగిస్తుంది.. అల్లంలో విటమిన్ -3, బీ 6 విటమిన్ -సి, మెగ్నీషియం వంటి పోషకాలుంటా అల్లంను నేరుగా చిన్న ముక్కలుగా తినొచ్చు లేదా దంచి, మెత్తగా చేసి టీ, వేడి నీళ్లలో కాచి తీసుకోవచ్చు. కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి తాగినా ప్రయోజనం ఉంటుంది
క్యాలిఫ్లవర్ : కూరగాయల్లో నిత్యం తీసుకోవాల్సిన వాటిలో క్యాలీఫ్లవర్ ఒకటి. క్యాలిఫ్ల వర్లో ఫైబర్, విటమిన్- సి, బి-6, కె, ఫోలేట్, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు లభిస్తాయి. వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నియంత్రించడంలో క్యాలిఫ్లవర్ సమర్థంగా పనిచేస్తుంది.
–వెలుగు, లైఫ్
