
న్యూఢిల్లీ: మన దేశంలోని ఎనిమిది ప్రధాన మౌలిక సదుపాయాల రంగాల వృద్ధి గత ఏడాది ఇదే నెలలో 5 శాతం నుంచి ఈసారి జూన్‌లో 1.7 శాతానికి తగ్గింది. మేతో పోలిస్తే సమీక్షలో ఉన్న నెలలో విస్తరణ కొద్దిగా మెరుగుపడింది. ఈ రంగాలు 1.2 శాతం పెరిగాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి జూన్‌లో తగ్గింది. రిఫైనరీ ప్రొడక్ట్స్ (3.4 శాతం), ఉక్కు (9.3 శాతం), సిమెంట్ (9.2 శాతం) ఉత్పత్తి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ కాలంలో ఎనిమిది రంగాలు 1.3 శాతం విస్తరించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో విస్తరణ 6.2 శాతం ఉంది.