గురుకుల పీజీటీ ఫలితాలు రిలీజ్

గురుకుల పీజీటీ ఫలితాలు రిలీజ్
  •     1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక 
  •     ఇయ్యాల్టి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) ఫలితాలను గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అంతేకాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను బోర్డు ప్రకటించింది. శని, ఆదివారాల్లో వివిధ సబ్జెక్టుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని తెలిపింది. 

శనివారం ఉదయం 9 గంటలకు పీజీటీ హిందీ, ఆదివారం ఉదయం 9 గంటలకు పీజీటీ సోషల్ స్టడీస్, మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వెల్లడించింది. పీజీటీ హిందీ అభ్యర్థుల సర్టిఫికెట్లను చైతన్యపురిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ ఫర్ విమెన్, పీజీటీ సోషల్ అభ్యర్థుల సర్టిపికెట్లను బంజారాహిల్స్​(రోడ్​నంబర్‌‌ 10)లోని బంజారా భవన్, పీజీటీ మ్యాథ్స్

 బయాలజీ అభ్యర్థుల సర్టిఫికెట్లను బంజారాహిల్స్​ (రోడ్​ నంబర్‌‌ 10)లోని కుమ్రం భీం ఆదివాసీ భవన్‌లో పరిశీలిస్తామని పేర్కొంది. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్టు తెలిపింది. పీజీటీ హిందీకి 327 మంది, పీజీటీ సోషల్​ స్టడీస్​కు 415

 మ్యాథ్స్​కు 459, బయాలజీకి 326 మందిని ఎంపిక చేసింది. కాగా, వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సెల్ఫ్ అటెస్టేషన్​ చేసిన రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లను తీసుకురావాలని బోర్డు వెల్లడించింది. ఏ సర్టిఫికెట్‌ మిస్‌ అయిన వెరిఫికేషన్‌కు అనుమతించమని స్పష్టం చేసింది.