
- గిరిజనుల భూములు లాక్కునే యత్నం చేస్తున్నారు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఎస్టీ మోర్చా నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. హరిత హారం కింద పొడు భూముల్లో చెట్లను పెట్టొద్దంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎస్టీల పొడు భూములను కాపాడకుండా వారి భూములను కేసీఆర్ లాక్కుంటున్నారన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మహబూబాబాద్ పర్యటన సందర్భంగా కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మరచిపోయారని ఈ సందర్బంగా బీజేపీ నేతలు విమర్శించారు.
ఒకవైపు మూడున్నర లక్షల మంది పోడు భూములు సాగు చేసుకుంటూ పట్టాల కోసం దరఖాస్తు చేసుకుని ఆశగా ఎదురు చూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం గిరిజన ఆదివాసీల భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన తర్వాతనే హరితహారం కార్యక్రమం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన జాతికి నయవంచన చేస్తున్న కేసీఆర్ కు కనువిప్పు కలిగించాలన్నారు.
ఇవి కూడా చదవండి
చైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
నాలాలు కబ్జా అయినా పట్టించుకోలేదు