జనవరి 10న HCA ఎన్నికలు

జనవరి 10న HCA ఎన్నికలు

HCA స్పెషల్ జనరల్ బాడీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మాజీ HCA సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 160 మంది మెంబర్స్ పాల్గొన్నారు.  ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వచ్చే ఏడాది జనవరి 10న ఎన్నికలు జరుపుతామని HCA సభ్యులు తీర్మానం చేశారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ స్పెషల్ జనరల్  బాడీ సమావేశం నిర్వహించామని హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్ వెంకటస్వామి తెలిపారు. 1996 నుంచి 1997 లో స్టేడియం కట్టించామన్నారు. HCA అధ్యక్షుల పదవి అయిపోయినా అజారుద్దీన్ అధ్యక్ష పదవి లో ఇంకా కొనసాగుతున్నారని ఆరోపించారు. వచ్చే నెల జనవరి10న  HCA ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సభ్యులందరూ  కలిసి HCA ని కాపాడుతామని తెలిపారు. 

అంతకు ముందు ఉప్పల్ స్టేడియం వద్ద హెచ్ సి ఏ సభ్యులను  సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ఉప్పల్ స్టేడియం లోనికి రాకుండా ముందస్తుగా గేట్లు మూసివేశారు. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సభ్యులు అక్కడకు చేరుకున్నారు. దీంతో అజార్ సూచనల మేరకు ఉప్పల్ స్టేడియం గేట్లను క్లోజ్ చేశారు. ఎవరినీ లోనికి అనుమతించకపోవడంతో గేటు బయటే  హెచ్ సీ ఏ మెంబర్స్, మాజీ అధ్యక్షులు , మాజీ కార్యదర్శులు  శివలాల్ యాదవ్ , జి వినోద్, అర్షద్ ఆయుబ్, శేష్ నారాయణ్, జాన్ మనోజ్ కొద్దిసేపు వెయిట్ చేశారు. 

HCA సభ్యులను లోపలికి రానివ్వకుండా గేట్లు మూసివేసి రోడ్డు మీద నిలబెట్టడంపై  HCA మాజీ  సెక్రటరీ శేషు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇది ఒక బ్లాక్ డే నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని..చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్ సీఏ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్స్ స్కామ్ మీద ఇప్పటి వరకు అజారుద్దీన్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.