వ్యూహం చిత్రంపై విచారణ రేపటికి వాయిదా

వ్యూహం చిత్రంపై విచారణ రేపటికి వాయిదా

రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కించిన వ్యూహం(Vyooham) సినిమాపై 2024  జనవరి 8న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను సెన్సార్ బోర్డ్  కోర్టుకు అందజేసింది.  సెన్సార్ బోర్డ్ రికార్డ్స్ ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామంది న్యాయస్థానం . దీనిపై రేపు మరోసారి హైకోర్టు వాదనలు వినునుంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.  

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు  వర్మ.. తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యూహం సినిమా తీశారంటూ లోకేశ్‌  పిటిషన్‌లో పేర్కొన్నారు.  దీంతో సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. 

జనవరి 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే  ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో సినిమా యూనిట్ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు రేపటికి వాయిదా వేసింది.