26లోగా ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను నియమించాల్సిందే : రాష్ట్ర సర్కార్​కు తేల్చి చెప్పిన హైకోర్టు 

26లోగా ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను నియమించాల్సిందే : రాష్ట్ర సర్కార్​కు తేల్చి చెప్పిన హైకోర్టు 
  • 26లోగా ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను నియమించాల్సిందే
  • రాష్ట్ర సర్కార్​కు తేల్చి చెప్పిన హైకోర్టు 

 హైదరాబాద్, వెలుగు :  ఈ నెల 26 లోగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్, మెంబర్లను నియమించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పది వారాల గడువు ఇచ్చే ప్రసక్తే లేదని, పది రోజుల్లో భర్తీ చేయాలని తేల్చి చెప్పింది. 10 వారాల గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎంతకాలం గడువు కోరుతూ ఉంటారని ప్రశ్నించింది.

ALSO READ: నేను ఐఏఎస్‌‌ కావాలని నాన్నకు, డాక్టర్ కావాలని అమ్మకు ఉండే : కేటీఆర్‌‌‌‌ 

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్​తో పాటు సభ్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంపై హైదరాబాద్‌‌కు చెందిన సోషల్‌‌ వర్కర్‌‌ గణేశ్​రావు వేసిన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్‌‌వీ శ్రవణ్‌‌ కుమార్‌‌ల  డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం మరోసారి విచారించింది. 10 వారాలు గడువిస్తే నియామక ప్రక్రియ పూర్తిచేసి రిపోర్టు ఇస్తామని ప్రభుత్వ లాయర్​ చెప్పడంపై స్పందించిన హైకోర్టు.. కోర్టు ఒప్పుకోలేదు. పది రోజుల్లో నియామకాలపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.