ఐనవోలు ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం చెల్లదు :హైకోర్టు ఉత్తర్వులు

ఐనవోలు ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం చెల్లదు :హైకోర్టు ఉత్తర్వులు

హనుమకొండ : ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల10న పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ట్రస్ట్​ బోర్డు ఏర్పాటులో రూల్స్ ​పాటించలేదంటూ హనుమకొండకు చెందిన పైల శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  నియామకం చెల్లదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు శుక్రవారం (ఈ నెల 13) నుంచి ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభంకానుంది. ఈసారి పాలకవర్గం లేకుండానే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఏటా చివరి నిమిషంలోనే.. 

ఐనవోలు  జాతర ఈనెల 13వ తేదీ నుంచి ఉగాది వరకు కొనసాగుతుంది. అయితే జాతరకు సంబంధించిన పనులు ఇప్పటికీ పెండింగ్​లోనే ఉన్నాయి. ఆలయంలో తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన వాటికలు, వసతికి సంబంధించిన సమస్యలు వేధిస్తున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో పాలకవర్గం లేకపోవడంతో ఏటా జాతర సమయంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తూ నెట్టుకొస్తున్నారని స్థానికులు అంటున్నారు.