ఖమ్మం మార్కెట్లో మిర్చికి అత్యధిక ధర

ఖమ్మం మార్కెట్లో మిర్చికి అత్యధిక ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి అధిక ధర పలికింది. జెండా పాట 22వేల 400 గా అధికారులు నిర్ణయించారు. రెండు రోజుల తర్వాత ఖమ్మం మార్కెట్ లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మార్కెట్లో శాంపిల్ బస్తాలు దాదాపు 600 పైగా అమ్మకానికి వచ్చాయి. రంగు మారిన మిర్చిని మార్కెట్ లో సాధారణంగా 11 వేలు నుంచి 12వేలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు 7వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని రంగు మారిన మిర్చి బస్తాలను కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాలు మిర్చికి ఇచ్చిన ధర కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మిర్చి కింటాకు 22 వేల 400  ఉండగా రూ.7వేలకు మాత్రమే కొనుగోలు చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.