జెండా పండుగైనా.. వీరి పైత్యం తగ్గదే.. నడిరోడ్లపై ఆకతాయిల హల్చల్..!

జెండా పండుగైనా.. వీరి పైత్యం తగ్గదే.. నడిరోడ్లపై ఆకతాయిల హల్చల్..!

హైదరాబాద్: ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు సెలవు దినం కావడంతో ఆకతాయిలు నడిరోడ్లపై హల్​చల్ సృష్టించారు. శంషాబాద్ పరిధిలో 10 మంది యువకులు ఐదు స్కూటీలపై వెళ్తూ ఫ్లైఓవర్​పై ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ మీదుగా వీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్ వే వైపు.. ఒకే స్కూటీపై మరో నలుగురు మైనర్లు వెళ్తూ స్టంట్‎లు చేశారు. 

లంగర్​హౌస్‎లో మరో ఇద్దరు యువకులు ఇలాగే స్టంట్లు చేస్తూ కనిపించారు. యువకుల ప్రమాదకర స్టంట్స్‎ను కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను కోరారు.