తండ్రి గొంతుకు వైర్ చుట్టి చంపేసిన కొడుకు

తండ్రి గొంతుకు వైర్ చుట్టి చంపేసిన కొడుకు

నార్కట్​పల్లి, వెలుగు :  తండ్రి ప్రవర్తనతో విసుగుచెందిన కొడుకు హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నార్కట్ పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య(50) కొడుకు మల్లేశ్ కొద్దిరోజుల కింద ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. కొడుకు పెండ్లి చేసుకోవడం నచ్చని లింగయ్య తన భార్యను వేధిస్తున్నాడు. 

అంతేకాకుండా పత్తి అమ్మగా వచ్చిన డబ్బులను ఇంట్లో ఇవ్వకుండా ఖర్చు పెట్టుకుంటున్నాడు. దీంతో తండ్రి ప్రవర్తనతో విసుగు చెందిన కొడుకు చంపేందుకు ప్లాన్ చేశాడు. గురువారం పత్తి చేనులో పని చేస్తుండగా కొడుకు వెళ్లి తండ్రి గొంతుకు వైర్ చుట్టి చంపేశాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కె.నాగరాజు, ఎస్ఐ డి.క్రాంతి కుమార్ తెలిపారు.