ఆసియా మనదే.. అబ్బాయిలకు స్వర్ణం... అమ్మాయిలకు కాంస్యం

ఆసియా మనదే.. అబ్బాయిలకు స్వర్ణం... అమ్మాయిలకు కాంస్యం

కాకమిగహారా (జపాన్): మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–18 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4–1తో జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఇండియా తరఫున ఆశిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తీ (2, 28, 34వ ని) హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుష్వాహా (30వ ని) మరో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

నుమాడ గాకు (52వ ని) జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఆట ఆరంభం నుంచే అటాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిన ఇండియా ఏ దశలోనూ జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 1.5 లక్షల నజరానాను ఇవ్వనున్నారు. 13 గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆశిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–18 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన పోరులో ఇండియా 3–0తో కొరియాపై గెలిచింది. సందీప కుమారి (2వ ని), కెప్టెన్ స్వీటీ కుజుర్ (16వ ని), నౌషీన్ నాజ్ (33వ ని) గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్లేయర్లకు రూ. 1 లక్ష, సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 50 వేల నజరానా దక్కనుంది.