పని మనుషులకు కనీస వేతనం.. అగ్రిమెంట్ లేకుండా నియమించుకోవద్దు.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే

 పని మనుషులకు కనీస వేతనం.. అగ్రిమెంట్ లేకుండా నియమించుకోవద్దు.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే
  • నిబంధనలు ఉల్లంఘించే ఓనర్లకు మూడు నెలల జైలు, జరిమానా  
  •     డ్రాఫ్ట్‌‌ బిల్లును రూపొందించిన కర్నాటక సర్కారు 

బెంగళూరు: 
డొమెస్టిక్ వర్కర్ల కోసం కర్నాటక సర్కారు కీలక చర్యలు చేపట్టింది. అగ్రిమెంట్‌‌ లేకుండా పని మనుషులను పెట్టుకోవడంపై నిషేధం విధించడంతోపాటు వారికి కనీస వేతనం చెల్లించాలనే ప్రపోజల్స్ తో డ్రాఫ్ట్‌‌ బిల్లు రెడీ చేసింది. రూల్స్ అతిక్రమించిన ఓనర్లకు లేదా ఏజెన్సీలకు 3 నెలల జైలుశిక్ష విధించేలా నియమాలు రూపొందించింది. ఈ డ్రాఫ్ట్‌‌ బిల్లుపై అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను తెలపాలని రాష్ట్ర ప్రజలకు నెల రోజుల గడువు ఇచ్చింది. 

డ్రాఫ్ట్‌‌ బిల్లులో పేర్కొన్న ప్రకారం.. డొమెస్టిక్ వర్కర్లకు యజమానికి మధ్య తప్పనిసరిగా రాతపూర్వక ఒప్పందం ఉండాలి. అగ్రిమెంట్‌‌లో కార్మికుడి పేరు, వివరాలు, చేసే పని స్వభావం, పని గంటలు, వేతనం, భత్యం వంటి వివరాలు పేర్కొనాలి. వారంలో మొత్తం పని చేసే సమయం 48 గంటలకు మించరాదు. వారానికి ఒకరోజు సెలవు లేదా వారంలో రెండు ఆఫ్‌‌ డే లీవ్స్‌‌ ఇవ్వాలి. వార్షిక సెలవులు కూడా వర్తింపజేయాలి. ఆడవాళ్లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి.

వర్కర్ల భద్రత కోసం వెల్ఫేర్‌‌‌‌ బోర్డు 

డొమెస్టిక్ వర్కర్లను రిక్రూట్‌‌ చేసే ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌‌ కలిగి ఉండాలి. వర్కర్లను నియమించుకున్న నెలరోజుల్లోగా వివరాలు నమోదు చేయాలి. ఈ బిల్లు ప్రకారం, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తరఫున వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కానుంది. చట్టవిరుద్ధంగా పనివాళ్లను నిర్బంధించడం, పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని బోర్డు అడ్డుకుంటుంది. పార్ట్‌‌టైమ్, ఫుల్‌‌టైమ్, లివ్-ఇన్, టెంపరరీ, గిగ్ వర్కర్లు, వలస కార్మికుల భద్రత కోసం కూడా బోర్డు పని చేస్తుంది.