
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రెజెంట్ జనరేషన్ పెళ్లిళ్ల పై అయన చేసిన కామెంట్స్ ఎవరి గురించి అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ లో.
"ఈ రోజుల్లో కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. కేవలం 'డెస్టినేషన్ వెడ్డింగ్' అనే ట్యాగ్‌ని పొందడానికి మాత్రమే చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారని.. నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పారు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ కు వెళ్లాను. ఆ వివాహానికి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని తెలిసి.. వధువు స్పృహ తప్పి పడిపోయింది" అంటూ పోస్ట్ చేశారు. వివేక్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
వివేక్ అగ్నిహోత్రి ట్విట్ చేసిన రోజే.. బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ హీరోయిన్ ను టార్గెట్ చేస్తూ.. వివేక్ ఈ కామెంట్స్ చేశాడని నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.
ఇక వివేక్ అగ్నిహోత్రి సినిమాల విషయానికి వస్తే.. గతంలో ఆయన 'ది కశ్మీర్ ఫైల్స్' అనే వివాదాస్పద సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన 'ది వ్యాక్సిన్ వార్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.