ది కాశ్మీర్ ఫైల్స్... రేపట్నుంచి సెక్షన్ 144

ది కాశ్మీర్ ఫైల్స్... రేపట్నుంచి సెక్షన్ 144

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలతో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోటాలో రేపట్నుంచి 144 సెక్షన్ విధించింది రాజస్థాన్ సర్కార్.‘ది కాశ్మీర్ ఫైల్స్’ స్క్రీనింగ్‌తో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, కోటాలో రేపటి నుండి ఏప్రిల్ 21 వరకు సెక్షన్ 144 విధించాలని నిర్ణయించింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఘన విజయం సాధించింది. మరోవైపు... జనం కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అటు పలు రాజకీయ పార్టీల మద్దతు కూడా లభించింది. గుజరాత్, మధ్యప్రదేశ్,గోవా, కర్నాటక,త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ మూవీగా ప్రకటించాయి. ఇప్పటికే ఈ సినిమాను ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు కూడా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని చెబుతున్నారు.