కమల్కు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన కేరళ స్టోరీ దర్శకుడు

కమల్కు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన కేరళ స్టోరీ దర్శకుడు

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కు ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. భారతదేశంలో "చాలా స్టుపిడ్ స్టీరియోటైప్స్' ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ఇంతకుముందు నేను వివరించడానికి ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా చేయడం లేదు. ఎందుకంటే ఈ సినిమా చూడని వారు మాత్రమే ఇది ప్రచార చిత్రం అని విమర్శిస్తున్నారు. చూసిన తర్వాత బాగుందని అంటున్నారు. 

పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కాలేదు. అక్కడి వాళ్ళు సినిమా చూసుంటే వాళ్లకి కూడా నచ్చేది.  బీజేపీకి సినిమా నచ్చితే, అది వారి సినిమా అయిపోదు. ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది, ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని అంతర్జాతీయంగా 37 దేశాల్లో ప్రజలు ఇష్టపడుతున్నారు.  విమర్శకులు సైతం ఫోన్ చేసి వారి అభ్యంతరాల గురించి చర్చిస్తున్నారు. కానీ సినిమా చూడకుండానే ఇది ఒక ప్రచార చిత్రం అంటే వారికి ఎలా వివరించగలనని" దర్శకుడు సుదీప్తో సేన్ అన్నారు.

ప్రస్తుతం సుదీప్తో సేన్ చేసిన ఈ కామెంట్స్ చర్చనియ్యంశంగా మారాయి. ఇక తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో కేరళ స్టోరీ గురించి మాట్లాడిన కమల్ హాసన్..  ‘‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకిని. మీరు టైటిల్‌ కింద ‘నిజమైన కథ’ అని రాసుకుంటే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అయిపోదు’’ అని అన్నారు. దీనికి కౌంటర్ గానే ఇప్పుడు దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించాడు.