టాటా–మిస్త్రీల మధ్య తాజా గొడవ

టాటా–మిస్త్రీల మధ్య తాజా గొడవ

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌‌‌‌కు మిస్త్రీ ఫ్యామిలీకి  మధ్య నడుస్తున్న గొడవ ఇప్పట్లో పరిష్కారమయ్యేటట్లు లేదు.  టాటా సన్స్‌‌‌‌లో  మిస్త్రీ ఫ్యామిలీకి ఉన్న 18.4 శాతం వాటా వాల్యూ రూ. 80 వేల కోట్లేనని(10.9బిలియన్ డాలర్లని) టాటా గ్రూప్‌‌‌‌ చెబుతోంది. కానీ మిస్త్రీలు మాత్రం వీటి వాల్యూ రూ. 1.75 లక్షల కోట్లు కంటే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇరువురు చెబుతున్న లెక్కలకు మధ్య సుమారు రూ. లక్ష కోట్ల గ్యాప్ ఉంది. టాటా సన్స్‌‌‌‌ ఫైనాన్షియల్ డిటైల్స్‌‌‌‌ను టాటా గ్రూప్‌‌‌‌ లాయర్ హరిష్‌‌‌‌ సాల్వే కోర్టుకు సమర్పించారు. టాటా సన్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవి నుంచి సైరస్‌‌‌‌ మిస్త్రీని  2016 లో టాటా గ్రూప్‌‌‌‌ తొలగించింది. అప్పటి నుంచి  టాటా గ్రూప్‌‌‌‌కు, మిస్త్రీ ఫ్యామిలీకి మధ్య గొడవ నడుస్తోంది. మిస్త్రీలకు డబ్బులు అవసరమైతే టాటా సన్స్‌‌‌‌లోని వారి వాటాను తామే కొంటామని ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో కోర్టులో టాటా గ్రూప్ పేర్కొంది. మిస్త్రీ ఫ్యామిలీ కూడా తమ వాటాలకు బదులుగా మార్కెట్లో లిస్టయిన టాటా కంపెనీలలో షేర్లను, డబ్బులను తీసుకోవాలని అనుకుంది.