కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌లో సింగరేణి సీఎండీ ఎన్‌‌.బలరాంనాయక్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌‌లను ప్రైవేట్‌‌ వారికి కాకుండా సింగరేణికే కేటాయించాలని, జెన్‌‌కో, ట్రాన్స్‌‌కో నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్లను వసూలు చేసి, సింగరేణి ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు.

అలాగే సింగరేణిలో ఓపెన్‌‌ కాస్ట్‌‌లను రద్దు చేసి అండర గ్రౌండ్‌‌ మైన్లను ప్రారంభించాలని, లాభంలో 45 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సీఎండీని కలిసిన వారిలో టీజేఎస్‌‌ స్టేట్‌‌ జనరల్‌‌ సెక్రటరీ నిజ్జన రమేశ్‌‌

సింగరేణి ఉద్యోగుల సంఘం లీగల్‌‌ అడ్వైజర్‌‌ రత్నం కిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవి సత్యం పాల్గొన్నారు.