వీడియో: అర్థరాత్రి ఇంట్లోకి చిరుత.. కుక్కపై దాడి

వీడియో: అర్థరాత్రి ఇంట్లోకి చిరుత.. కుక్కపై దాడి

మహారాష్ట్ర నాసిక్ లోని ముంగ్సారేలో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. ఈ నెల 5వ తేదీన అర్థరాత్రి ఓ ఇంట్లోకి దూరిన చిరుత.. పెంపుడు కుక్కను నోట కరుచుకుని వెళ్లింది. ఈ దాడి సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ముంగ్సారేలో ఆదివారం అర్ధరాత్రి.. ఓ ఇంటి బయట గోడపై కుక్క పడుకుంది. అక్కడే మాటువేసి ఉన్న చిరుత....  కుక్కను పట్టుకెళ్లింది. గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. రాత్రి పూట అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు.