రైతులు, నిరుద్యోగుల ప్రాణాలకు విలువలేదు

రైతులు, నిరుద్యోగుల ప్రాణాలకు విలువలేదు
  • కేసీఆర్వి స్వార్ధపూరిత రాజకీయాలు
  • వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

సూర్యాపేట జిల్లా: కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ మోసపూరితమేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం భక్తాలపురంలో షర్మిల పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ.. వారి కష్ట సుఖాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూడలి ప్రాంతాల్లో జనాలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ 8 ఏళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.  నిరుద్యోగుల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కేలేదని విమర్శించారు.  కేసీఆర్ పరిపాలనలో మోసపోని వర్గం అంటూ లేదన్నారు. కాంగ్రెస్ ,బీజేపీలు ప్రజల పక్షాన నిలబడలేదని షర్మిల ఆరోపించారు.