కాదు కాదు.. మా సినిమా కథ వేరు

కాదు కాదు.. మా సినిమా కథ వేరు

ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ పీక్స్ కి చేరుకుంది. ఆయన గురించి వినిపిస్తున్న ఏ చిన్న న్యూస్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా చరణ్ నెక్స్ట్ మూవీకి సంభందించిన మరో న్యూస్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమే అనుకోని చరణ్ ఫాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. చివరికి పరిస్థితి ఎక్కడికి వచ్చింది అంటే ఆ సినిమా మేకర్సే అవన్నీ రూమర్స్అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు.

ఇంతకీ చరణ్ గురించి వినిపిస్తున్న ఆ రూమర్ ఏంటా అనుకుంటున్నారా? చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా తరువాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో ఓ భారీ సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందన్నాడు చరణ్. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే.. తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా ఇండియన్ రెజ్లర్ కోడి రామ్మూర్తి జీవిత కథ అని. ఎక్కడినుండి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో స్వయంగా RC16 మేకర్స్ మా సినిమా కథ అది కాదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దీంతో.. RC16 కథపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. మరి RC16 మూవీ ఏ కథతో వస్తుందో? అది ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.