
హైదరాబాద్, వెలుగు: మలేషియా టూరిజం డిపార్ట్‌మెంట్ ఈ నెల 3 నుంచి 7 మధ్య అతిపెద్ద టూరిజం రోడ్‌షోను నిర్వహించనుంది. హైదరాబాదు, బెంగళూరు, కొచ్చి వంటి ముఖ్యమైన నగరాలలో ఈ రోడ్‌షోలు ఉంటాయి. ఈ ఈవెంట్లలో మలేషియాకు చెందిన 62 మంది సేల్స్ ప్రతినిధులు పాల్గొంటారు. కిందటేడాది మలేషియాను 10 లక్షల మంది భారతీయ పర్యాటకులు సందర్శించారని అంచనా.