హైట్ పెరగడం కోసం రూ.55 లక్షలు ఖర్చు చేసిన యువకుడు

హైట్ పెరగడం కోసం రూ.55 లక్షలు ఖర్చు చేసిన యువకుడు

టెక్సాస్: బరువు పెరిగితే చాలా మంది యోగా, జిమ్, రన్నింగ్ లాంటివి చేస్తూ వెయిట్ తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు లైపో లాంటి సర్జరీలు చేయించుకొని నాజూగ్గా తయారవుతారు. అయితే హైట్ పెరగడానికి ఓ యువకుడు కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నాడు. అది కూడా రూ.55 లక్షలు పెట్టి మరీ ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. సదరు వ్యక్తి పేరు అల్ఫోన్సో ఫ్లోర్స్. ఆయనది అమెరికాలోని టెక్సాస్‌‌. 28 ఏళ్ల అల్ఫోన్సోకు చిన్నప్పటి నుంచి బాగా ఎత్తు పెరగాలనే కోరిక ఉండేది. ఆయన హైట్ 5 ఫీట్‌‌ల 11 అంగుళాలు. అయితే ఈ ఎత్తు కూడా ఆయనకు తక్కువగానే అనిపించింది.

రీసెంట్‌‌గా మరింత ఎత్తు పెరగాలనే ఉద్దేశంతో అల్ఫోన్సో కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ అనంతరం మరో రెండు ఇంచులు హైట్ కూడా పెరిగాడు. ఇప్పుడు ఆయన ఎత్తు 6.11 ఫీట్‌‌లు. హార్వర్డ్ యూనివర్సిటీలో ట్రెయినింగ్ తీసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కెవిన్ దేవీప్రసాద్ ఈ ఆపరేషన్ చేశారు. లింబ్‌‌ప్లాస్ట్‌‌ఎక్స్ కాస్మొటిక్ లింబ్ లెంగ్త్‌‌నింగ్ పద్ధతి ద్వారా అల్ఫోన్సో తొడ ఎముకకు శస్త్రచికిత్స చేశామని దేవీప్రసాద్ తెలిపారు. ఈ ప్రక్రియతో మనిషి ఎత్తు 6 అంగుళాల వరకు పెరిగే చాన్సెస్ ఉంటాయన్నారు. దీనిపై అల్ఫోన్సో స్పందిస్తూ.. ‘5.11 ఫీట్లు మంచి హైట్ అని నాకు తెలుసు. చాలా మంది అంత ఎత్తు ఉండాలని కోరుకుంటారు. కానీ నాకు ఇంకొంచెం హైట్ ఉండాలని ఉండేది. అందుకే సర్జరీ చేయించుకున్నా’ అని అల్ఫోన్సో ఫ్లోర్స్ పేర్కొన్నాడు.