పుస్తకాన్ని 63 ఏండ్ల తర్వాత లైబ్రరీకి పంపిన రీడర్!

పుస్తకాన్ని 63 ఏండ్ల తర్వాత లైబ్రరీకి పంపిన రీడర్!

లైబ్రరీకి పోయి పుస్తకాలు తెచ్చి చదువుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. కానీ, ఒక్కోసారి చదివిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వడం మర్చిపోతారు. అలా లైబ్రరీల నుంచి తీసుకున్న పుస్తకాలు చాలానే మిస్‌‌ అవుతాయి. అట్లాంటి స్టోరీనే ఇది కూడా. న్యూకేజిల్ లైబ్రరీ నుంచి చదువుకోవడానికి పుస్తకం తీసుకుపోయిన ఓ వ్యక్తి చదివినంక దాన్ని తిరిగి ఇయ్యలేదట.  ఏం అనుకున్నడో ఏమో.. 63 ఏండ్ల తర్వాత దాన్ని తిరిగి లైబ్రరీకి పంపిండని లైబ్రరీ మేనేజర్‌‌‌‌ డేవిడ్‌‌ హిప్‌‌వర్త్‌‌ చెప్పాడు. ఫైన్‌‌ కట్టాలని భయపడ్డడో ఏమో తెలీదు. కాని తన పేరు, ఊరు, అడ్రస్‌‌ ఏం తెలియకుండా జాగ్రత్త పడి దాన్ని లైబ్రరీకి పంపాడు. ‘మర్చిపోయేకంటే.. లేటుగా ఇవ్వడమే బెటర్‌‌‌‌’ అని రాసి ఉందని అన్నాడు. న్యూకేజిల్‌‌ లైబ్రరీలోని ‘హౌవ్‌‌ టూ లై విత్‌‌ స్టాటిస్టిక్స్‌‌’ పుస్తకం ఫస్ట్‌‌ ఎడిషన్‌‌ అదేనని చెప్పాడు డేవిడ్‌‌. ఏదేమైనా పుస్తకం తిరిగొచ్చిందని ఆనందంగా ఉందన్నాడు. అయితే అంత సిన్సియర్‌‌‌‌గా పుస్తకం పంపిన వ్యక్తి ఎవరో తెలిస్తే కచ్చితంగా అతనికి కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇస్తామని డేవిడ్ అంటున్నాడు.