రామగుండం బీఆర్ఎస్ అసమ్మతి నేతలతో కేటీఆర్ భేటీ

రామగుండం బీఆర్ఎస్ అసమ్మతి నేతలతో కేటీఆర్ భేటీ

రామగుండం బీఆర్ఎస్ అసమ్మతి నేతలతో మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. రామగుండానికి చెందిని ఐదుగురు కీలక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రామగుండం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను ఐదుగురు నేతలు కేటీఆర్ కు వివరించారు. సర్వేలను బట్టి పార్టీ టికెట్ ఇస్తామని కేటీఆర్ వారికి వివరించారు.

బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే పనులు ఎవరూ చేయవద్దని అసంతృప్తి నేతలకు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కష్టపడి పని చేయాలని కోరారు. సర్వేల రిపోర్టు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే పార్టీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కోరుకంటి చందర్ రామగుండం ఎమ్మెల్యే కాబట్టి తనతో మాట్లాడుతానని, అలా అని ఆయన తనకు దగ్గర అనుకుంటే ఎలా అని, తనకు అందరూ ఒక్కటే అని పార్టీ నేతలకు సర్ది చెప్పారు మంత్రి కేటీఆర్.

ఎమ్మెల్యే చందర్ తమపై కేసులు పెట్టించి.. తీవ్రంగా వేధించారని కేటీఆర్ కు ఐదుగురు నేతలు ఫిర్యాదు చేశారు. అయితే.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టిన విషయం తనకు తెలియదని కేటీఆర్ వారితో చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాంగుండం నియోజకవర్గంలో ప్రెస్ మీట్ లు పెట్టవద్దని కేటీఆర్ ఆదేశించారు.