అందం కోసం గాడిదపాలతో స్నానం

అందం కోసం గాడిదపాలతో స్నానం

పిజ్జా, బర్గర్​, పాస్తా... లాంటి నోరూరించే జంక్​ ఫుడ్స్​లో చాలామందికి ఇష్టమైంది చీజ్​. రెస్టారెంట్​కి వెళ్తే ఆర్డర్​తోపాటు ‘ఎక్స్​ట్రా చీజ్​’ అని స్పెషల్​గా చెప్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిలో రకాలు కూడా ఉన్నాయి. మనదేశంలోనే ఎనిమిది రకాల చీజ్​లున్నాయి. విరిగిన పాలను కొన్ని రోజుల పాటు ప్రాసెస్​ చేసి, చీజ్​ తయారుచేస్తారని తెలుసు. కానీ, ప్రపంచంలోనే అతి ఖరీదైన చీజ్ ప్యూల్​ డాంకీ చీజ్​. దీని ధర కిలో దాదాపు రూ.40 నుంచి 70 వేలు.

సాధారణంగా గేదె, ఆవు, మేక, ఒంటె పాలు తాగుతారు. వాటితో నెయ్యి, చీజ్​ వంటివి తీస్తారు. కొన్నిచోట్ల గాడిద పాలు కూడా తాగుతారు. కాకపోతే అవి కొంచెం రేటు ఎక్కువ. అప్పుడప్పుడు గాడిదను వెంటబెట్టుకుని వీధుల్లో తిరుగుతూ వాటి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి అమ్ముతుంటారు కొందరు. కాకపోతే ఈ గాడిదల జాతి వేరే. స్లోబోడాన్ సిమిక్ అనే అతను పాతికేండ్ల క్రితం సెర్బియా దేశంలో బాల్కన్ జాతిని గుర్తించాడు. బాల్కన్​ జాతి ప్రపంచం మొత్తంలో ‘జసవిక స్పెషల్ నేచర్ రిజర్వ్​’లో మాత్రమే దొరుకుతుంది. ఆ గాడిదల పాలతో తయారుచేసిందే ప్యూల్ డాంకీ చీజ్​. అవి యుగోస్లేవియాలో మూడు చోట్ల మాత్రమే పెంచుతారు. ఒక బాల్కన్​ జాతి గాడిద ఏడాదికి ఆరునెలలు, ఒకరోజుకి దాదాపు నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. కాకపోతే దీని తయారీలో అరవై శాతం గాడిదపాలు, మిగతా నలభై శాతం మేక పాలు కలుపుతారు. ఈ చీజ్ తయారవ్వాలంటే ప్రాసెసింగ్​కే కొన్ని నెలలు పడుతుంది. అందుకే దానికి అంత రేటు.

నిజానికి చీజ్​ తయారుచేయడానికి ఆ గాడిదలను పెంచట్లేదు. బాల్కన్​ జాతి అంతరించిపోకూడదనే ఉద్దేశంతో డైరీ ఫామ్ పెట్టారు. అందులో రెండొందల గాడిదలు ఉండేవి. అవి చాలా ఎక్కువ మొత్తంలో పాలు ఇస్తుండేసరికి, వాటినేం చేయాలా? అని ఆలోచించి చీజ్ తయారుచేశాడట సిమిక్. రోజుకి మూడు సార్లు పాలు తీస్తాడు. అలా ఒక ఏడాదికి దాదాపు 70 కిలోల చీజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

బాల్కన్​ గాడిద పాలలో ఎనభై శాతం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఆ పాలు తాగితే డైజెషన్​ ప్రాబ్లమ్స్​ రావు. అంతేకాదు, గుండె, లివర్, జ్వరం, ఆస్తమా, ఇన్ఫెక్షన్​ వ్యాధులను కూడా నయం చేస్తుందని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. చీజ్​లో విటమిన్స్​, మినరల్స్​ ఎక్కువ. టైప్​2డయాబెటిస్​ తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంతేకాదు, ఈ గాడిద పాలు సోప్, పౌడర్​ వంటి కాస్మొటిక్స్​లో కూడా వాడతారు. కొన్ని ఇంపోర్టెడ్ చాక్లెట్స్​లో పౌడర్​లా వాడతారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర అందం కోసం గాడిదపాలతో స్నానం చేసేదట.