
ఆడపిల్ల పుట్టింది మొదలు రూల్స్ మొదలు. కేవలం బిడ్డకే కాదు ఆ బిడ్డని కన్న తల్లికీ బోలెడు రూల్సే. పిల్లలు పుట్టాక ఉద్యోగమా? పిల్లల బాగోగులు చూసుకోకుండా వ్యాపారమా? అంటూ ప్రతి విషయంలో తల్లిని జడ్జ్ చేస్తుంటారు. ఈ విషయంపైనే రీసెంట్గా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ డిపా బుల్లర్– ఖోస్లా ‘తల్లికి రూల్స్ బుక్’ లేదని ప్రపంచానికి చెప్పడానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని వేదిక చేసుకుంది. డిపా ఇంతకుముందు రెండుసార్లు కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఈ సారి రెడ్ కార్పెట్ ఆమెకి మరింత ప్రత్యేకం. ఎందుకంటే పోయిన మేలో డిపాకి ఆడపిల్ల పుట్టింది. తల్లిగా మొదటిసారి కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడుస్తుండటంతో తన అమ్మతనంపై ఓ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంది. అందుకే తను వేసుకున్న బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాస్ట్యూమ్‌కి బ్రెస్ట్ పంప్స్ ఏర్పాటు చేసుకుని రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా. ‘‘తల్లయ్యాక నేను తీసుకుంటున్న నిర్ణయాల్ని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. కొందరు నా అమ్మతనాన్ని జడ్జ్ చేస్తున్నారు కూడా. బ్రెస్ట్ ఫీడింగ్ అందరి తల్లులకి వీలు కాదు. ఆ విషయం అర్థం చేసుకోకుండా చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంటారు. కానీ, మేము కూడా అందరిలాంటి మనుషులమే. తెర వెనుక మాకూ పర్సనల్ లైఫ్, ఎమోషన్స్ ఉంటాయి. అయినా నా దృష్టిలో తల్లంటే బిడ్డకి జన్మనివ్వడం ఒక్కటే కాదు. రూపం చూడకుండానే ప్రేమించడం.. భూమ్మీదకి రాకముందే తన అభిరుచుల్ని తెలుసు కోవడం. జీవితాంతం వాళ్ల పట్ల రెస్పాన్సిబుల్‌గా ఉండటం. వెలకట్టలేని ప్రేమ, కేర్ అందించడం’’ అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.