డియర్ కామ్రేడ్ ను కట్ చేశారు

డియర్ కామ్రేడ్ ను కట్ చేశారు

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఎమోషనల్ లవ్ డ్రామా మూవీ డియర్ కామ్రేడ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాకు కాస్త నెగిటివ్ కామెంట్స్ కాట్స్ కూడా తప్పలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతోందట. దీనికి కారణం సినిమా నిడివి ఎక్కువగా ఉండటమేనంటూ చాలా మంది ప్రేక్షకులనుంచి  వస్తున్న స్పందన. దీంతో ఆడియన్స్ బోర్ గా ఫీల్ కాకుండా 30 నిమిషాల పాటు నిడివి తగ్గించారు సినీ దర్శక నిర్మాతలు.

డియర్ కామ్రేడ్ సినిమా ఈనెల 26న తెలుగు, త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో విడుదలైంది. ఇందులో భాగంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన సినీ నిర్మాతలు… సినిమా నిడివి ఎక్కువగా ఉందని, స్లోగా ఉందంటూ కామెంట్స్ రావడంతో 30 నిమిషాల సినిమాను కట్ చేసామని తెలిపారు.  ఫైనల్ గా సెకండ్ హాఫ్ రన్ టైమ్ ను తగ్గించారు.