జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సమైక్యతా వజ్రోత్సవాల్లో అపశృతి జరిగింది. భూపాలపల్లి కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఉల్టా ఎగరేశారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే జాతీయ జెండా తలకిందులుగా ఉండడంతో ఆఫీసర్లు టెన్షన్‌పడ్డారు. వెంటనే జెండాను సరిచేసి మరోసారి ఆవిష్కరించారు. జరిగిన తప్పిదానికి బాధ్యులైన రిజర్వ్ ఎస్సై సదానందంతో పాటు మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ప్రకటించారు.
